最新专辑 :
歌手列表 :
○男生   ○女生
○团体   ○其他
○日韩   ○欧美
○作词   ○作曲
搜索 :

提供歌词:
提供歌词及错误更正
(欢迎提供 动态歌词)
语言 :
繁體 简体

Anaganaga Oka Uru (Female Version)【Shreya Ghoshal】

Anaganaga Oka Uru (Female Version) 歌词 Shreya Ghoshal
歌词
专辑列表
歌手介绍
Shreya Ghoshal Anaganaga Oka Uru (Female Version) 歌词
Shreya Ghoshal


అనగనగా ఒక ఊరు
అనుకోకుండా ఒకనాడు
కలిశారే పసివాళ్ళు స్నేహంగా

సంతోషమంతా రెక్కలుగా
రివ్వంటూ ఎగిరే పక్షులుగా
ఆకాశమంతా ఆటాడుకుంటూ ఉన్నారు సరదాగా

ఒకరేమో సీను ఒకరేమో జున్ను
కలిశారే ప్రాణంగా కురిశారే వర్షంగా
పాటేమో సీను ఆటేమో జున్ను
ఒకటయ్యి ఎదిగారే మధురంగా

ప్రపంచమంతా తమ ఇల్లంటూ
ప్రతీ క్షణం ఒక పండుగగా
కన్నీరు లేని కలలే కంటూ
చిన్నారి చెలిమే బలపడగా

తియతియ్యని ఊసులతో
తెల్లతెల్లని మనసులలో
కథ ఇలాగ మొదలయ్యేగా
కథ ఇలాగ మొదలయ్యేగా

అనగనగా ఒక ఊరు
అనుకోకుండా ఒకనాడు
కలిశారే పసివాళ్ళు స్నేహంగా

~ సంగీతం ~

ఎగిరిన బుడగలలోన చెలిమే
ఉరికిన పడవలలోన చెలిమే
రంగులరాట్నంలో చెలిమే చిందులు వేసిందే

మిణుగురు వెలుగులలోన చెలిమే
తొలకరి తేనెలలోన చెలిమే
గాజుల గలగలలో చెలిమే సందడి చెసిందే

ఈ జ్ఞాపకాలన్నీ నిలెచేనులే
నీ జీవితానికి బలమై నడిపేనులే
ఈ సాక్ష్యాలే అనుబంధాల భవనానికి స్తంబాలే

నా నా నా నా నా నా .....

తెలపని కబురులలోన చెలిమే
తిరగని మలుపులలోన చెలిమే
దొరకని చేపలలో చెలిమే దోసిలి నింపింది

జరిగిన నిమిషములోన చెలిమే
ఎరగని మరునిమిషాన చెలిమే
కాలం చెక్కిలిలో చెలిమి చుక్కై మెరిసింది

చిననాడు మురిపించే ఈ గురుతులే
కనరాని దారిని చూపే నీ గురువులే
ఉండాలంటూ ఈ బతుకంతా మాటలకే కట్టుబడి

నా నా నా నా నా నా .....


发布评论
昵称 :

验证码 : 点击更新验证码
( 禁止谩骂攻击! )